కెరీర్‌గెడైన్స్..కోరుకొండ, కలికిరి సైనిక్ స్కూల్స్
తొలి రోజు నుంచే మిలటరీ ఓరియెంటెడ్‌గా విద్యా బోధన సాగేసైనిక పాఠశాల్లో ప్రవేశించడం
భవిష్యత్తులో త్రివిధ దళాల్లో కెరీర్‌కు తొలిమెట్టు వంటిదే. ఒక్కసారి ప్రవేశించిన
విద్యార్థులు సీబీఎస్‌ఈ +2 పూర్తయ్యే వరకు ఇక్కడే చదివే అవకాశం.. నేషనల్ డిఫెన్స్
అకాడెమీలో అడుగుపెట్టే వీలు సైనిక్ స్కూల్స్ ప్రత్యేకత. అందుకే వీటిలో ప్రవేశానికి
నిర్వహించే పరీక్షకు ప్రతి ఏటా పోటీ పెరుగుతోంది.
చిన్న తనం నుంచే
క్రమశిక్షణ.. క్రమ బద్ధమైన జీవితం.. ధైర్య సాహసాలు.. శారీరక ధ్రుడత్వం.. ఇవన్నీ
కావాలంటే సరైన వేదికలు ‘సైనిక్ స్కూల్స్’. మన రాష్ట్రంలోని విజయనగరం జిల్లా
కోరుకొండతోపాటు.. నూతనంగా ఏర్పాటు చేసిన చిత్తూరు జిల్లా కలికిరిలోని సైనిక
పాఠశాలలో (ఆరో తరగతిలో మాత్రమే).. 2014-15 విద్యా సంవత్సరానికి ఆరు, తొమ్మిదో
తరగతుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ప్రవేశ విధానం, సంబంధిత
వివరాలు..
సీట్లు:
కోరుకొండ: ఆరో తరగతి-175, తొమ్మిదో
తరగతి-120
కలికిరి: ఆరో
తరగతి-100.
ప్రవేశ
విధానం:ప్రవేశ విధానంలో రెండు దశలు ఉంటాయి. అవి..ప్రవేశ
పరీక్ష, ఇంటర్వ్యూ. ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ దశకు అర్హత
కల్పిస్తారు. ఈ రెండు దశల్లో చూపిన ప్రతిభ ఆధారంగా అడ్మిషన్‌ను ఖరారు చేస్తారు.
పరీక్ష తీరు:
రాత
పరీక్షను ‘ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్’ పేరుతో
నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీతోపాటు గుర్తింపు పొందిన ఆధికారిక
భాషల్లో ఉంటుంది. ఆరు, తొమ్మిదో తరగతుల కోసం వేర్వేరుగా ఈ పరీక్ష జరుగుతుంది. ఆరో
తరగతి ప్రశ్నపత్రాన్ని ఇంగ్లిష్‌తోపాటు గుర్తింపు పొందిన ఆధికారిక భాషల్లో
రూపొందిస్తారు. తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్ష పత్రం ఇంగ్లిష్ భాషలోనే ఉంటుంది.
ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే
పరీక్ష రెండు విభాగాలుగా ఉంటుంది. అవి..
| విభాగం | మార్కులు |
| మ్యాథమెటిక్స్ అండ్ లాంగ్వేజ్ | 200 |
| ఇంటెలిజెన్స్ టెస్ట్ | 100 |
| మొత్తం | 300 |
తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష కూడా రెండు విభాగాలుగా ఉంటుంది. అవి..
| విభాగం | మార్కులు |
| మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ | 275 |
| ఇంగ్లిష్ అండ్ సోషల్ సెన్సై | 175 |
| మొత్తం | 450 |
ఇందులో మార్కుల విభజన..మ్యాథమెటిక్స్-200 మార్కులు), సైన్స్-75
మార్కులు.
ఇంగ్లిష్-100 మార్కులు, సోషల్ స్టడీస్-75 మార్కులు.
ప్రిపరేషన్:
ఈ రెండు పరీక్షల్లో అడిగే ప్రశ్నల స్థాయి విద్యార్థులు ప్రస్తుతం వారు చదువుతున్న తరగతుల సిలబస్ ప్రమాణాల మేరకే ఉంటుంది. లాంగ్వేజ్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఇంగ్లిష్ భాషపై ఉన్న ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఇంటెలిజెన్స్ టెస్‌్్లో జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించిన ప్రశ్నలే ఉంటాయి.
ఆరో తరగతి: ఈ పేపర్‌లో ఇంగ్లిష్‌లో ఎస్సే రైటింగ్, కాంప్రెహెన్షన్, వొకాబ్యులరీ, జెండర్, యాంటినామ్స్, సినానిమ్స్, సెంటెన్సెస్, రీఆరేజింగ్, వెర్బ్ ఫామ్స్, నౌన్స్, యాడ్‌వెర్బ్స్, గ్రామెటికల్ స్ట్రక్చర్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
మ్యాథమెటిక్స్: ఇందులో నంబర్ సిస్టమ్, ఫ్రాక్షన్, డెసిమల్స్, కమర్షియల్ మ్యాథమెటిక్స్, మెన్సురేషన్, జామెట్రీ (ప్రాథమిక భావనలు) వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
తొమ్మిదో తరగతి: ఈ పేపర్ కోసం ఎనిమిదో తరగతి వరకు ఉన్న సోషల్ స్టడీస్ (జాగ్రఫి, సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్), సైన్స్ (బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ)లలో అన్ని అంశాలను చదవాలి. మ్యాథమెటిక్స్‌లో స్క్వేర్స్, క్యూబ్స్, కంపౌండ్ ఇంట్రెస్ట్, పాలినామిల్స్, సర్కిల్స్, ట్రాయాంగిల్స్, సర్కిల్స్, స్టాటిస్టిక్స్ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఇంగ్లిష్‌లో ఎస్సే రైటింగ్, కాంప్రెహెన్షన్, వొకాబ్యులరీ, జెండర్, యాంటినామ్స్, సినానిమ్స్, సెంటెన్సెస్, రీఆరేజింగ్, వెర్బ్ ఫామ్స్, నౌన్స్, యాడ్‌వెర్బ్స్, గ్రామెటికల్ స్ట్రక్చర్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
చదవాల్సిన పుస్తకాలు:ప్రశ్నలను సీబీఎస్‌ఈ సిలబస్ ఆధారంగా రూపొందిస్తారు. ఈ నేపథ్యంలో ఆరు తరగతి విద్యార్థులు..సీబీఎస్‌ఈ ఐదో తరగతి పుస్తకాలను, తొమ్మిదో తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ ఎనిమిదో తరగతి పుస్తకాలను చదవడం ప్రయోజనకరం.
రాత పరీక్ష తర్వాత: రాత పరీక్షలో ప్రతిభ చూపించిన విద్యార్థులకు ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ దశకు 50 మార్కులు కేటాయించారు. ఇందుకోసం 1:3 నిష్పత్తిలో విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. రాత పరీక్షకు సాధించిన మార్కులకు ఇంటర్వ్యూ మార్కులను కలుపుతారు. నిర్దేశించిన ప్రమాణాలను పరిశీలించడానికి మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ‘మెడికల్లీ ఫిట్’ అనే ధ్రువీకరణ పొందితేనే ప్రవేశం ఖరారవుతుంది.
స్కాలర్‌షిప్ సదుపాయాలు:
విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో మెరిట్ స్కాలర్‌షిప్స్, ఇన్‌కమ్ బేస్డ్ స్కాలర్‌షిప్స్, ఢిఫెన్స్ స్కాలర్‌షిప్స్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 18 వేల కంటే తక్కువ ఉన్న ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ నుంచి స్కాలర్‌షిప్‌లు లభిస్తాయి. కుటుంబ వార్షిక ఆదాయం రూ. రెండు వేల లోపు ఉంటే ఉచిత బోధన సదుపాయం, తదితరాలకు మెరిట్ కమ్ మీన్స్ స్కాలషిప్స్ సదుపాయం కల్పిస్తారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా రాష్ట్ర విద్యార్థుల్లో 50 శాతం మందికి రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్ లభిస్తుంది. అంతేకాకుండా నెలవారీగా ఇన్‌కమ్ బేస్డ్ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తుంది. +2 తర్వాత ఎన్‌డీఏలో ప్రవేశం ఖరారు చేసు కున్న వారికి.. +1, +2లలో చెల్లించిన ఫీజు మొత్తాన్ని రీయింబర్స్‌మెంట్ చేయడం మరో ప్రత్యేక సదుపాయం అందుబాటులో ఉంది.
రాష్ట్రానికి ప్రాధాన్యం:
సైనిక్ స్కూల్లో ప్రవేశాలకు అఖిల భారత స్థాయిలో పరీక్ష నిర్వహించినా.. సీట్ల కేటాయింపులో ఆయా రాష్ట్రాల విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అంటే నిర్దేశిత సైనిక్ స్కూల్ ఉన్న రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు 67 శాతం సీట్లు; దేశంలోని మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత విద్యార్థులకు 33 శాతం సీట్లు లభిస్తాయి.
అడుగు పెడితే:
సైనిక్ స్కూల్స్‌లో ప్రవేశం ఖరారు చేసుకున్న విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు దిశగా పయనిస్తారనేది నిస్సందేహం. పదో తరగతి వరకు ఆల్ ఇండియా సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్, తర్వాత 12వ తరగతి వరకు ఆల్ ఇండియా సీనియర్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ కోసం సిద్ధం చేస్తారు. అంతేకాకుండా 12వ తరగతి తర్వాత పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరే విధంగా శిక్షణనిస్తారు. ప్రతి విద్యార్థి ఎన్‌సీసీలో చేరడం తప్పనిసరి.
అర్హతలివే:
ఆరో తగరతిలో ప్రవేశానికి: విద్యార్థులు పదేళ్లు పూర్తి చేసుకుని పదకొండేళ్లలోపు ఉండాలి. ప్రస్తుత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు జూలై 2, 2003 - జూలై 1, 2004 మధ్య జన్మించి ఉండాలి.
తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి: పదమూడేళ్లు నిండి 14ఏళ్లలోపు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. తాజా ఔత్సాహికులు జూలై 2, 2000- జూలై 1, 2001 మధ్యలో జన్మించి ఉండాలి. అంతేకాక తొమ్మిదో తరగతిలో ప్రవేశ సమయానికి గుర్తింపు పొందిన స్కూల్‌లో ఎనిమిదో తరగతి పూర్తి చేసుకోవడం తప్పనిసరి.
అకడమిక్, వయో అర్హతలతోపాటు మంచి ఆరోగ్యం కూడా విద్యార్థులకు ఉండాల్సిందే. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రమాణాలు ఉంటేనే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఇలా:
‘ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్, కోరుకొండ’ పేరిటి ఎస్‌బీఐ బ్రాంచ్‌లో చెల్లేలా రూ. 475 డీడీ (ఎస్సీ, ఎస్టీలకు రూ. 325) తోపాటు సొంత చిరునామా గల కవరుని స్కూల్ చిరునామాకు పంపి దరఖాస్తు పొందొచ్చు. నిర్దేశించిన రుసుం చెల్లించి నమూనా ప్రశ్నపత్రాలను, గతేడాది పరీక్ష పత్రాలను కూడా పొందొచ్చు.
రాత పరీక్ష తేదీ: జనవరి 5, 2014.
దరఖాస్తుల లభ్యతకు చివరి తేదీ: నవంబర్ 30, 2013.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: డిసెంబర్ 7, 2013.
వెబ్‌సైట్: www.sainikschoolkorukonda.org

Comments
Post a Comment