‘లా’కు చక్కటి మార్గం లాసెట్..

పీజీ లాసెట్పీజీ లాసెట్ (పోస్ట్‌గ్రాడ్యుయేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష ద్వారా ఎల్‌ఎల్‌ఎం/ఎంఎల్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
అర్హత: ఎల్‌ఎల్‌బీ/బీఎల్ ఉత్తీర్ణులు.
పరీక్ష విధానం: మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. వ్యవధి: 90 నిమిషాలు. ప్రశ్నపత్రంలో రెండు పార్ట్‌లు ఉంటాయి. పార్ట్-ఎలో భాగంగా జ్యూరిస్ ప్రుడెన్స్‌పై 20, కాన్‌స్టిట్యూషనల్ లాపై 20 ప్రశ్నలు అడుగుతారు. పార్ట్-బిలో మర్కెంటైల్ లా; లేబర్ లా; పబ్లిక్ ఇంటర్నేషనల్ లా; క్రైమ్స్ అండ్ టార్ట్స్; ఐపీఆర్, ఇతర లాలకు సంబంధించిన ఒక్కో అంశంపై 16 ప్రశ్నలు చొప్పున మొత్తం 80 ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ప్రశ్నపత్రం ఉంటుంది.

ఇటీవల లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (లాసెట్), పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీ లాసెట్)-2014 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సెట్‌లను తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించనుంది.

ముఖ్య తేదీలు
  • ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: మార్చి 12, 2014.
  • దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 26, 2014.
  • అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మే 31, 2014.
  • వెబ్‌సైట్: www.aplawcet.org 
  •  పీజీ లాసెట్
    పరీక్ష తేదీ: 08-06-2014
    సమయం: 2.30pm - 4pm 

Comments

Popular posts from this blog

VIVO Brand Guide + SWOT ANALYSIS

Business Strategy in a Digital Age