ప్రస్తుతం సమున్నత వృత్తిగా లీగల్ ప్రొఫెషన్
వెలుగొందుతోంది. మారుతున్న ఆర్థిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు
కొత్త కొత్త స్పెషలైజేషన్లతో కళకళలాడుతోంది. బ్యాంకింగ్, బీమా, టెలికం, ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ, రియల్ ఎస్టేట్.. ఇలా చాలా విభాగాల్లో న్యాయ సేవల అవసరం పెరిగింది. ఆ
అవసరమే కొత్త కొలువులను అందుబాటులోకి తెస్తోంది. దీంతో లా కెరీర్.. యువత ఆకర్షణీయ
కెరీర్ ఆప్షన్ల జాబితాలోకి చేరింది.
లాసెట్-2014లాసెట్ (లా కామన్ ఎంట్రన్స్
టెస్ట్). ఈ పరీక్ష ద్వారా మూడేళ్ల బీఎల్/ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదేళ్ల
ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
అర్హత: మూడేళ్ల లా కోర్సుకు
10+2+3 విధానంలో 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఐదేళ్ల లా కోర్సుకు 45 శాతం
మార్కులతో ఇంటర్(10+2 విధానంలో). ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు 5 శాతం మార్కులు
సడలింపు ఉంటుంది.
పరీక్ష విధానం:
ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మూడేళ్ల కోర్సుకు,
ఐదేళ్ల కోర్సుకు సిలబస్ ఒకటే అయినప్పటికీ, ఎంపిక చేసుకున్న కోర్సును బట్టి ప్రశ్నల
క్లిష్టత ఉంటుంది. ఐదేళ్ల లా ప్రశ్నపత్రం ఇంటర్మీడియెట్ స్థాయిలో, మూడేళ్ల లా
ప్రశ్నపత్రం డిగ్రీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రశ్నపత్రంలో 120
ప్రశ్నలు మూడు విభాగాల్లో ఉంటాయి. 90 నిమిషాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.
| విభాగం |
ప్రశ్నల సంఖ్య |
మార్కులు |
1. జనరల్ నాలెడ్డ్,
మెంటల్ ఎబిలిటీ |
30 |
30 |
| 2. కరెంట్ అఫైర్స్ |
30 |
30 |
| 3. లా ఆప్టిట్యూడ్ |
60 |
60 |
- కరెంట్ అఫైర్స్ తేలికైన విభాగం. తక్కువ శ్రమతోనే ఎక్కువ మార్కులు సాధించేందుకు
వీలుకల్పిస్తుంది. ఇందులో అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ ముఖ్య పరిణామాలపై
ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నలు ఏదో ఒక రంగానికి పరిమితం కాకుండా సామాజిక, ఆర్థిక,
సదస్సులు, అవార్డులు, ఐరాస నివేదికలు, నియామకాలు, ముఖ్య వ్యక్తులు వంటి అంశాల నుంచి
వస్తాయి. ఇందులో మెరుగైన స్కోర్ సాధించాలంటే ప్రామాణిక దినపత్రికలు చదవాలి.
- జనరల్ నాలెడ్జ్ విషయానికొస్తే స్టాండర్డ్ జీకేను ప్రిపేర్ కావడం మంచిది. ఈ
క్రమంలో అవార్డులు, ప్రథమ వ్యక్తులు, గ్రంథాలు-రచయితలు, సంస్థలు-ఏర్పాటు చేసిన
సంవత్సరం, భారత రాజ్యాంగం వంటి అంశాలను చదవాలి.
- మెంటల్ ఎబిలిటీలో ప్రశ్నల క్లిష్టత ఇతర పోటీ పరీక్షల స్థాయి కంటే కొద్దిగా
తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ విభాగం కోసం అనాలజీ, నంబర్ సిరీస్, అల్ఫాబెట్
సిరీస్, కోడింగ్-డీకోడింగ్ వంటి అంశాలను ప్రాక్టీస్ చేయాలి.
- న్యాయ విద్య అభ్యసించేందుకు అవసరమయ్యే ఆప్టిట్యూడ్‌పై ప్రశ్నలు వస్తాయి.
ప్రాథమిక న్యాయ సూత్రాలు, భారత రాజ్యాంగం తదితరాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
-
ముఖ్య తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: మార్చి 12, 2014.
- దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 26, 2014.
- అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మే 31, 2014.
- వెబ్‌సైట్: www.aplawcet.org
- లాసెట్పరీక్ష తేదీ:
08-06-2014
సమయం:10am - 11.30am
-
Comments
Post a Comment