సమాజ సేవకు అత్యద్భుత అవకాశం పిఎమ్‌ఆర్‌డి ఫెలోషిప్
మీకు సామాజిక సేవ చేయాలని ఉందా... రైతుల సమస్యలను
తెలుసుకుని పరిష్కార మార్గాలను సూచించే బాధ్యతలను నిర్వర్తించాలని ఉందా... దళిత
వర్గాల సమస్యల పరిష్కారానికి ఏదైనా మంచి పని చేయాలని ఆలోచిస్తున్నారా... మారుమూల
గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాలు
చూపించాలనుకుంటున్నారా.. సమాజం పట్ల బాధ్యత కలగి దేశం పట్ల ప్రేమతో వెనుకబడిన
జిల్లాలలోని సమస్యలను పరిష్కరించడం ద్వారా దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా...
ఇలాంటి ఆలోచనలతో సమాజానికి మంచి చేయాలనుకునే యువతకు ఇది బాధ్యతాయుతమైన అవకాశం.
పిఎమ్‌ఆర్‌డి ఫెలోషిప్ కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, రాష్ట్రాల
గ్రామీణాభివృద్ధి శాఖలతోపాటు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ సంయుక్తంగా
నిర్వహిస్తున్నాయి.
పిఎమ్‌ఆర్‌డి ఫెలోషిప్గ్రామీణ ప్రాంతాలలో రైతులు, నిరుపేదలు, గిరిజనులు, దళితవర్గాల సమస్యల గురించి తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేయడానికీ, ప్రభుత్వ పథకాల తీరును విశ్లేషించడానికి కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమమే ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి ఫెలోషిప్. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపికైనవారు నిర్దేశించిన వెనుకబడిన జిల్లాలలో తమ విధులను నిర్వహించాల్సి ఉంటుంది.
ఫెలోబాధ్యతలు
మూరుమూల గ్రామాలలో పేదలు, రైతులకోసం పనిచేసే సంస్థల సామర్థ్యాన్ని పెంచడం, వారికి అందాల్సిన సాయం అందేటట్లు చూడటం, స్వయం సహాయ సంఘాలతో పాటు, గ్రామపంచాయితీల తీరు తెన్నులను గురించి, వాటి సాధికారత గురించి పరిశీలించడం, ప్రజలకు ఉపయోగపడే విధంగా తగిన శక్తి సామర్థ్యాలను పెంచడానికి తోడ్పాటునందించడం, స్థానికంగా గ్రామస్థాయిలో ప్రజాసంక్షేమానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయడం, ప్రభుత్వం అమలు చేస్తున్న పేదరిక నిర్మూలనా కార్యక్రమాల అమలుకు సాయం చేయడం, జాతీయ ఉపాధిహామీ పథకం, జవహార్ రోజ్‌గార్‌యోజన వంటి అనేక పథకాల అమలకు తోడ్పాటు నందించడం, పేదల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ పథకాలు సరిగా అందతున్నాయో లేదో తెలుసుకుని పరిష్కార మార్గాలు సూచించడం వీరి ముఖ్యమైన విధులు.
ఖాళీలుగత సంవత్సరం 8,600 మంది దరఖాస్తు చేశారు. వడపోత తర్వాత కేవలం 156 మాత్రమే ఎంపికయ్యారు. వారిలో 34 మంది యువతులు కూడా ఉన్నారు. ఇలా ఎంపికైన వారు దేశంలోని 84 వెనుకబడిన జిల్లాలలో ప్రజల సమస్యలను పరిష్కరించే పనుల్లో నిమగ్నమయ్యారు.
పిఎంఆర్‌డిఎఫ్ కింది ఈ ఏడాది 140 మందిని ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబరు 15 ఆఖరి తేదీ. 50 శాతం మార్కులతో 4 సంవత్సరాల డిగ్రీ లేదా పీజీ ఉన్న వారు అర్హులు. జనరల్ అభ్యర్థుల వయస్సు 22 నుంచి 27 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. దేశంలో 40 కేంద్రాల్లో జరిగే ఆలిండియా కాంపిటెన్సీ అసెస్‌మెంట్ పరీక్ష డిసెంబరులో జరుగుతుంది. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు జనవరి 5న జరిగే రాత పరీక్ష, ఇంటర్వ్యూకి ఎంపికవుతారు.
ఆకర్షణీయమైన వేతనాలు
ఈ కార్యక్రమానికి ఎంపికైన ఫెలోస్ నాలుగు వారాల పాటు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఉంటుంది. ఈ సమయంలో 50 వేలు వేతనంగా ఇస్తారు. వీరు మొదటి సంవత్సరం నెలకు 75వేల రూ.లు వేతనంగా పొందుతారు. రెండో ఏడాది పదిశాతం పెరుగుదల, మూడో ఏడాది దానికి మరో 10శాతం పెరుగుదలతో వేతనాలు అందుకుంటారు. ప్రముఖ సంస్థలు కూడా ప్రారంభంలోనే ఇంత భారీ వేతనాలు ఇవ్వడం లేదు. దీనితోపాటు ఉచిత రవాణా, వసతి సౌకర్యాలు ఉంటాయి. ఫెలోగా మూడు సంవత్సరాలు పూర్తిచేసిన వారు తర్వాత గ్రామీణాభివృద్ధిశాఖలో మంచి అవకాశాలు ఉంటాయి. ఈ పథకం ద్వారా వచ్చే వేతనాలు గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న వారికిచ్చే వేతనాలలో ఉత్తమమైనవిగా చెప్పవచ్చు.
డిగ్రీ పొందవచ్చుమూడు సంవత్సరాల పాటు ఈ పిఎంఆర్‌డిఎఫ్ విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులు టాటాఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ ఎమ్మెస్సీ లేదా ఎం.ఫిల్ డ్రిగ్రీ ఇస్తుంది. ఉద్యోగం, ఫెలోషిప్‌తోపాటుగా డిగ్రీ కూడా రావడం మరో అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు.
మనరాష్ట్రంలో పిఎంఆర్‌డిఎఫ్ అమలులో ఉన్న జిల్లాలుపిఎంఆర్‌డి ఫెలోగా ఎంపికైన వాళ్ళు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 84 జిల్లాలలో విధులు నిర్వహించాలి. సాధారంణగా స్థానిక భాషా ప్రాధాన్యత అడిగారు కాబట్టి ఏ రాష్ట్రంలో వాళ్ళు ఆ రాష్ట్రంలోనే పనిచేయడానికి అవకాశం కల్పిస్తారు. మన రాష్ట్రంలో కరీంనగర్, ఖమ్మం, విశాఖ, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో పిఎంఆర్‌డి ఫెలోలు పనిచేస్తున్నారు. మనరాష్ట్రంలో 8 జిల్లాలలో 12 మంది ఫెలోలు పనిచేస్తున్నారు. ప్రముఖ సంస్థలలో ఉగ్యోగాలు వచ్చినా వాటిని వదులుకుని గ్రామాలలో పనిచేయడానికి యువకులు ఈ ప్రొగ్రాం ద్వారా ముందుకు వస్తున్నారు. సేవే లక్ష్యంగా వస్తున్న యువతకు మంచి వేతనాలు ఉండటం కూడా ప్రోత్సాహానిస్తుంది. వెనుకబడిన జిల్లాలలో సమస్యల మూలాలను తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి ఈ పిఎంఆర్‌డి ఫెలోషిప్ ప్రోగ్రాం బాగా ఉపకరిస్తుంది.
మరిన్ని వివరాలకు: rural.nic.in/pmrdfs

Comments
Post a Comment