అవకాశాల తరంగం.. ఇన్సూరెన్స్
రంగం
దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న రంగాల్లో బీమా
ఒకటి.. లక్షల కోట్ల టర్నోవర్‌తో అతిపెద్ద రంగంగా అవతరిస్తోంది.. వ్యక్తులు,
పరిశ్రమలు, ఆస్తుల వరకూ విస్తరించిన ఈ రంగంలో.. బీమా కంపెనీలు ఎప్పటికప్పుడు
కొత్తకొత్త పాలసీలు, పథకాలతో ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీమా రంగం కింది
స్థాయి నుంచి మేనేజీరియల్ స్థాయి వరకు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే వేదికగా
నిలిచే అవకాశం ఉంది.
ఓ సర్వే ప్రకారం- రానున్న 2015 వరకు
దేశంలో బీమా రంగానికి ‘స్వర్ణయుగ’మని చెప్పొచ్చు. 1999 వరకు కేవలం 6 కంపెనీలు
ఉంటే.. ఇప్పుడు దేశంలో 46 బీమా కంపెనీలున్నాయి. ఈ 46 బీమా కంపెనీల్లో ఒక్కో
కంపెనీకి ఏటా సుమారు 100 మంది నిపుణుల అవసరం ఉంటోంది. ఆ విధంగా అన్ని కంపెనీలు ఏటా
సుమారు 5 వేల మంది నిపుణులను భర్తీ చేసుకోవచ్చు. ఇవికాకుండా మార్కెటింగ్ విభాగంలో
క్లెయిమ్ హ్యాండ్లర్స్, మార్కెటింగ్ ఆఫీసర్ హోదా ఉద్యోగాలతోపాటు కింది స్థాయి
ఉద్యోగాలు లక్షల్లో ఉండొచ్చు.
ప్రవేశం:బీమా రంగంలో నిపుణుల కొరతను
తీర్చేందుకు పలు ఇన్‌స్టిట్యూట్‌లు వివిధ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిని
పూర్తి చేయడం ద్వారా బీమా రంగంలో కెరీర్‌ను ప్రారంభించవచ్చు.
స్కిల్స్:బీమా రంగాన్ని కెరీర్‌గా
ఎంచుకోవాలనుకునే వారికి కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. అవి..మ్యాథమెటిక్స్,
ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న విద్యార్థులు ఈ కెరీర్లో రాణించడం సులువు. దానికితోడు
ఇంటెలిజెన్స్, సహనం, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, చురుకుదనం, అందరితో కలిసి పని చేయగల
నేర్పు ఉన్నవారు ఇందులో వేగంగా రాణిస్తారు. కేవలం క్షేత్రస్థాయిలో పనిచేసేవారికి
మాత్రమే ఇతరులను ఒప్పించే నైపుణ్యం అవసరం.
అవకాశాలు:బీమా రంగంలో కోర్సులు
పూరి్తచేస్తే ఉద్యోగావకాశాలకు ఢోకాలేదు. సంబంధిత రంగంలో నిపుణుల కొరత తీవ్రంగా
ఉండడంతో ఇన్సూరెన్స్ కోర్సులు చదివిన అభ్యర్థులను నియమించుకోవడానికి కంపెనీలు పోటీ
పడుతున్నాయి. ఇందుకోసం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కూడా నిర్వహిస్తున్నాయి. వీరికి
ప్రధానంగా ఐటీ, కార్పొరేట్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ రంగాల్లోని అనేక జాతీయ,
అంతర్జాతీయ కంపెనీలు , ఇఫ్కో-టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఎయిర్ వరల్డ్‌వైడ్
ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఐసీఐసీఐ లాంబార్డ్
ఇన్సూరెన్స్ కంపెనీ, టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యూనివర్సల్ సాంపో జనరల్
ఇన్సూరెన్స్ కంపెనీ, శ్రీరాం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్
జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునెటైడ్ బ్యాంక్,
ఇన్ఫోసిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి కంపెనీలు కెరీర్ అవెన్యూస్‌గా నిలున్నాయి. ఇక్కడ
గమనించాల్సిన విషయం..ఐటీ రంగం, ఇతర మేనేజ్‌మెంట్ రంగాల్లో సంక్షోభ పరిస్థితులు
తలెత్తే అవకాశం ఉంది. కానీ, బీమా రంగం ఎప్పటికీ సుస్థిరంగా ఉంటుంది. ఒకరకంగా
చెప్పాలంటే.. ఇన్సూరెన్స్ ఈజ్ లాంగ్‌టర్మ్ బిజినెస్ కాబట్టి ఈ రంగంలో ఉద్యోగ భద్రత
అధికమే.
పనివిధానం-
హోదాలిలా:కెరీర్ ప్రారంభంలో అండర్‌రైటర్స్, క్లెయిమ్
హోల్డర్స్, మార్కెటింగ్ ఆఫీసర్స్, రిస్క్ మేనేజర్స్ హోదాలతో పని చేయాల్సి ఉంటుంది.
తర్వాత సీనియారిటీ, అనుభవం ఆధారంగా అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్
క్లెయిమ్స్ నుంచి వైస్ ప్రెసిడెంట్ స్థాయి వరకు ఎదగవచ్చు
వేతనాలు:ప్రస్తుతం ఇన్సూరెన్స్ రంగం
ఐటీ రంగానికి సమానంగా వేతనాలను ఆఫర్ చేస్తున్నాయి. పని చేస్తున్న కంపెనీ, హోదాను
బట్టి ఆరంభంలో రూ.5 లక్షల వరకూ వార్షికవేతనం లభిస్త్తుంది. ఈ రంగంలో ఆరు నుంచి
ఏనిమిదేళ్ల అనుభవం ఉంటే సంవత్సరానికి రూ. 15 లక్షల వేతనం
అందుకోవచ్చు.
భవిష్యత్:దేశంలో ఇన్సూరెన్స్ ఉన్న వారు
4 శాతం మాత్రమే. అదే ఇతర దేశాల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కలిగిన ప్రజలు 15 శాతం నుంచి 17
శాతం వరకు ఉన్నారు. క్రమక్రమంగా ప్రజల్లో ఇన్సూరెన్స్ అవసరంపై అవగాహన పెరుగుతుండడం,
మార్కెట్ విస్తరిస్తుండడం, కొత్త కంపెనీల ఏర్పాటుతో వీటన్నింటికీ బీమా అవసరం
తప్పనిసరవుతోంది. ప్రస్తుతం కార్పొరేట్ రంగం నుంచి పారిశ్రామిక రంగం వరకూ.. బీమా
లేకుండా ముందుకు వెళ్లడంలేదు. కాబట్టి భవిష్యత్తులో ఇన్సూరెన్స్ రంగంలో నిపుణుల
అవసరం భారీగా పెరగబోతోంది. బీమా రంగంలో క్షేత్రస్థాయి, మేనేజీరియల్ నిపుణులతో కలిపి
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య 50
లక్షలు దాటనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను 49
శాతం వరకు అనుమతించింది. దాంతో భవిష్యత్తులో ఈ రంగంలో భారీ పెట్టుబడులు వచ్చే
అవకాశం ఉంది. అది కొత్త కంపెనీల స్థాపనకు దారితీయనుంది. దాంతో అనేక కొత్తకొత్త
అవకాశాలు పుట్టుకురానున్నాయి. జనరల్ ఇన్సూరెన్స్‌తో పోల్చితే లైఫ్ ఇన్సూరెన్స్
కాలవ్యవధి ఎక్కువ. కాబట్టి బీమా రంగ భవిష్యత్తు దీర్ఘకాలంపాటు కొనసాగుతుంది.
Comments
Post a Comment