రెండు రాష్ట్రాలకు ఒకే ఏపీసెట్

హైదరాబాద్, న్యూస్‌లైన్: స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ తెలంగాణ, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనే పేర్లతో ఒకే ఏపీసెట్‌ను నిర్వహించనున్నారు. పదవ షెడ్యూల్ ప్రకారం ఏపీసెట్ (అధ్యాపక ఉద్యోగ అర్హత పరీక్ష) ఉమ్మడి జాబితాలో ఉన్నందున రెండు రాష్ట్రాలకు ఒకేసెట్‌ను నిర్వహించనున్నారు. దీనిని ఉస్మానియూ యుూనివర్సిటీ నిర్వహించనుంది. ఏపీసెట్-2014 నిర్వహణకు ప్రభుత్వ అనుమతి కోసం లేఖను పంపించారు. అనుమతి రాగానే వచ్చే నెల చివర్లో 27 సబ్జెక్టులకు ఏపీసెట్-2014 ప్రకటన విడుదల చేయనున్నట్టు ఏపీసెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ రాజేశ్వర్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. పరీక్ష ఒకటే జరిగినా ఫలితాలు మాత్రం రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఉంటాయి. ఏపీసెట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తును పూరించే సవువుంలో అభ్యర్థి ఏ రాష్ట్రానికి చెందిన వారో పేర్కొనాలి. రెండు రాష్ట్రాల్లో 12 ప్రాంతీయ కేంద్రాలలో జరిగే పరీక్షకు అభ్యర్థి తను ఎంచుకున్న రీజియన్‌లో రెండు రాష్ట్రాలలో ఎక్కడినుంచైనా హాజరుకావచ్చు.

Comments

Popular posts from this blog

VIVO Brand Guide + SWOT ANALYSIS

Business Strategy in a Digital Age